Thursday, January 23, 2025

లోయలో పడిన స్కూల్ బస్సు: 16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

School bus fell into gorge in Himachal pradesh

 

సిమ్లా: స్కూల్ బస్సు లోయలో పడిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కుల్లు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నియోలీ -సంసార్ రోడ్డులోని సాయింజి గ్రామ శివారులో విద్యార్థులతో వెళ్తున్న స్కూలు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. రెస్క్యూ టీమ్, పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీస్ అధికారి అశుతోష్ గార్గ్ తెలిపాడు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను  బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News