Sunday, December 22, 2024

హనుమకొండలో స్కూల్‌ బస్‌ రోడ్డుపై బోల్తా

- Advertisement -
- Advertisement -

మియాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై యూ టర్న్‌ తీసుకుంటున్న స్కూల్‌ బస్సును వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు రోడ్డుకు అడ్డుగా పడిపోయింది. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో గురువారం సాయంత్రం ఏకశిలా పాఠశాలకు చెందిన స్కూలు బస్సు పిల్లలతో వెళ్తుంది. స్కూల్‌ సమయం ముగియడంతో పిల్లలను దించడానికి వెళ్తుంది. ఈ క్రమంలో కమలాపూర్‌ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై యూటర్న్‌ తీసుకుంటుండగా… ఇంతలో అనుకోని రీతిలో అటుగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది.

బస్సు వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు దానిని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే బస్సు ముందు వైపు ఉన్న అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సు కిటికీల్లోంచి దూకిన ఇద్దరు విద్యార్థులు అతనికి సహాయం చేయడంతో అద్దం పగిలింది. దీంతో ముందరి అద్దం తొలగించడంతో… బస్సులో ఉన్న మిగతా విద్యార్థులు ఒక్కొక్కరికిగా బయటకు వచ్చారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News