Monday, December 23, 2024

హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హరియాణా రాష్ట్రం నార్నాల్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పిన స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులకు తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News