- Advertisement -
కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఓక్లా స్కూల్ లో బస్సుప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో ఒకటో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఒకటో తరగతి విద్యార్థిని మహన్విత(5)పై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో బాలికను వెంటనే మమతా ఆస్పత్రికి స్కూల్ సిబ్బంది తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్కూల్ యజమాన్యం బస్సు డ్రైవర్ ను ఘటనా స్థలం నుంచి బయటకు పంపించారు. బాలిక బస్సు నుండి జారిపడి మృతి చెందారని తల్లిదండ్రులకు స్కూల్ యజమాన్యం సమాచారం ఇచ్చింది. కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.
- Advertisement -