Monday, December 23, 2024

కారు ప్రమాదంలో స్కూల్ పిల్లలకు గాయాలు

- Advertisement -
- Advertisement -

గోరఖ్‌పూర్ (యుపి) : రామ్‌పూర్ దారి గ్రామ పెద్ద లాల్ బచన్ నిషాద్ కారు డ్రైవింగ్ చేతకాకపోయినా కారు నడిపి 8 మంది స్కూల్ పిల్లలను గాయపరిచారు. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. గాయపడిన పిల్లలంతా ఐదేళ్ల లోపు వారే. వారిని ఖోరబార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు , అక్కడ నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డారని, దీనిపై పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఖోరబార్ స్టేషన్ ఆఫీసర్ ఆర్‌పి సింగ్ చెప్పారు. గ్రామ పెద్దను అరెస్ట్ చేశారు. కారును పట్టుకున్నారు. గ్రామ పెద్ద స్కూలులో టాయిలెట్ టాంక్ కట్టిస్తున్నారని, ఆయన కుమారుడు తన కారులో స్కూల్‌కు భోజనం తీసుకొచ్చారని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. అయితే కారును ఎలా నడపాలో డ్రైవింగ్ చేతకాకపోయినా గ్రామ పెద్ద కారును నడపడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News