అమరచింత : అమరచింత మండల పరిధిలోని పామ్‌రెడ్డిపల్లె గ్రామ సమీపం లో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం విష ఆహారం తినడం వల్ల పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన తెలుసుకున్న వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రజిని శనివారం ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి రజిని పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే ఆహారాన్ని, తాగునీరు, కిచెన్ రూం, తరగది గదు లు, మరుగుదొడ్లను పరిశీలించారు.
మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయం విద్యార్థినిలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అందుకు విద్యార్థినిలు మాట్లాడుతూ ఫిల్టర్ నీళ్లకు బదులు బోర్ నీటిని తాగుతున్నామని రోజువారి గా మె నూ ప్రకారం తమకు టిఫిన్, స్నాక్స్ అందించడం లేదని విద్యార్థినిలు జడ్జికి తెలిపారు. ఇంటర్మీడియట్‌కు సంబంధించిన సబ్జెక్టులలో కెమిస్ట్రి, బాటని లెక్చరర్లను నియమించాలని జడ్జి సూచించారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కస్తూర్భా గాంధీ పాఠశాల సంఘటనపై తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కస్తూర్భా గాంధీ పాఠశాల టీచర్లు, ఆత్మకూరు లోక్ అదాలత్ సిబ్బంది, తదితర అధికారు లు పాల్గొన్నారు. అనంతరం వనపర్తి డిపిఓ కస్తూ ర్భా గాంధీ పాఠశాల గదులను, పరిసరాలను, వా టర్, తాగునీటి బోరు పైప్‌లైన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీచర్లతో, ఎంఈఓ భాస్కర్ సింగ్ తో మాట్లాడుతూ పాఠశాల శుభ్రత, పరిశుభ్రతపై టీచర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని సూ చించారు. వర్షాకాలం మొదలైందని, దోమల ని వారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థినిల కు ఏఎన్‌ఎం అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాత్రి వేళలో హాస్టల్లో ఏఎన్‌ఎం, వాచ్‌మెన్ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.