Thursday, January 23, 2025

టీచర్‌పై స్కూల్ డైరెక్టర్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Sixteen-year-old girl raped in Rajanna Sirisilla

లక్నో: టీచర్‌పై ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ అత్యాచారం చేసి అనంతరం వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు  ఆమెను కిడ్నాప్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షాహాజాన్‌పూర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో 22 ఏళ్ల యువతి టీచర్‌గా పని చేస్తోంది. రెండు నెలల క్రితం  పాఠశాల సంబంధించిన వర్క్ ఉందని ఆమెకు కబరుపంపాడు. షాహజాన్ పూర్ లో ఓ హోటల్ చేరుకున్న తరువాత మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింక్ ఆమెకు ఇచ్చాడు. ఆమె స్పృహలో లేనప్పడు ఆమెపై అత్యాచారం చేయడంతో వీడియో తీశాడు. ఈ వీడియోను చూపించి వివాహేతర సంబంధం కొనసాగించాలని పలుమార్లు ఆమెను వేధించాడు. ఈ విషయం ఆమె తండ్రికి చెప్పడంతో అతడు వెళ్లి ఆ డైరెక్టర్‌ను వీడియోలను తీసివేయాలని అడిగాడు. ఆ డైరెక్టర్ ఆమె తండ్రిని చంపుతానని బెదిరించాడు.  అతడి కూతురును కిడ్నాప్ చేశాడు. దీంతో ఆమె తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు 366, 376, 506 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News