Monday, December 23, 2024

బడి వేళలు తగ్గింపు

- Advertisement -
- Advertisement -

School education department decided to reduce school hours

ఉ.8 నుంచి 11.30 వరకు స్కూళ్లు
ఏప్రిల్ 7నుంచి పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. గురువారం(మార్చి 31) ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే పాఠశాల విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కుదించిన వేళలు ఏప్రిల్ 6 వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల లోపే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్, ఎయిడెట్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు.

ఏప్రిల్ 7 నుంచి పరీక్షలు

రాష్ట్రంలో ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి ఎస్‌ఎ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు జరుగనున్నాయి. అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23లోగా ఫలితాలు ప్రకటించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News