- Advertisement -
షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): 12 ఏళ్ల క్రితం నకిలీ విద్యారికార్డులపై ఉద్యోగం సంపాదించిన ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్టు జిల్లా మెజిస్ట్రేట్ ఉమేష్ ప్రతాప్ సింగ్ బుధవారం చెప్పారు. పృధ్వీపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జైపాల్ నకిలీ విద్యా రికార్డులపై ఉద్యోగం సంపాదించినట్టు స్థానికుల ఫిర్యాదు రావడంతో స్పెషల్ టాస్క్ ఫోర్సుతో దర్యాప్తు చేయించగా, ఆయన రికార్డులన్నీ నకిలీవని తేలిందని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. దర్యాప్తు నివేదిక బేసిక్ శిక్ష అధికారి సురేంద్ర సింగ్ రావత్‌కు పంపామని తెలిపారు.
- Advertisement -