Monday, December 23, 2024

జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా హెడ్ మాస్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: 77 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం పూరి జిల్లాలో జరిగింది. ప్రఫూల్లా చంద్రా సాహూ అనే పంతులు మళ్లీశ్వరి ప్రాజెక్ట్ ప్రైమరీ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హెడ్ మాస్టర్ ప్రఫుల్లా చంద్రా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రఫుల్లా చనిపోయాడని వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. క్రిష్ణ ప్రసాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రఫుల్లా అందరితో కలిసి ఉండేవాడని, టీచింగ్ అద్భుతంగా చేసేవాడని, పంతులు అనారోగ్యానికి ఎప్పుడు గురికాలేదని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా…. ఇంట్లోకి వచ్చిన తల్లిదండ్రులు… వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News