Tuesday, November 5, 2024

ఫ్లూ కలవరం.. పాఠశాలలకు సెలవులు

- Advertisement -
- Advertisement -

పుదుచ్చేరి : దేశంలో పలుచోట్ల హెచ్3 ఎన్2 క్రమంగా విజృంభిస్తుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి కొనసాగుతున్నందున పది రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అన్ని స్కూళ్లలో 8 వ తరగతి వరకు సెలవులు ఇస్తున్నామని, మార్చి 16 నుంచి 24 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది.

పుదుచ్చేరిలో మార్చి 11 నాటికి 79 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు మరణాలు మాత్రం చోటు చేసుకోలేదు. కేసుల సంఖ్య పెరిగితే చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆరోగ్యశాక అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే ఇన్‌ఫ్లుయెంజా కోసం ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశ వ్యాప్తంగా 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయినట్టు అటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా తెలిపింది. ఈ సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా కారణంగా కర్ణాటక, హర్యానా, గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News