నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్, క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్కూల్ లైఫ్ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పులివెందుల మహేష్ హీరో, దర్శకుడుగా సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా నిర్మిస్తున్న సినిమా స్కూల్ లైఫ్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పులివెందుల మహేష్ ఎంతో కష్టపడి తానే హీరో, దర్శకుడుగా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు వి సముద్ర విచ్చేసి టీమ్‌కు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నా ఒక్కడిదే కాదు. సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమా కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ప్రజల డబ్బుతో ఈ సినిమా తీస్తున్నాను. ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ చేస్తారని నమ్ముతాను. సినిమా ద్వారా చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుంది’ అని అన్నారు. నిర్మాత రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ.. మహేష్ చెప్పినప్పుడు కథ నచ్చి ఈ సినిమాలో ఒక భాగమయ్యాను. ప్రేక్షకులు ఎప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఆదరించి సక్సెస్ చేయాలి’ అని కోరుకుంటున్నాను. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఆగస్టు 2న ప్రారంభంచి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు రామ్, హీరోయిన్ సావిత్రి కృష్ణతో పాటు చిత్ర బృందం పాల్గొంది.