పాట్నా: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన స్కూల్ ప్రిన్సిపాల్‌కు కోర్టు ఉరిశిక్ష విధించిన సంఘటన బీహార్‌లోని పాట్నాలో జరిగింది. ఈ ఘటనలో సహాయం చేసిన ఉపాధ్యాయుడికి జీవితఖైదుతో పాటు యాబై వేల జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుల్వారీ షరీఫ్‌లో 11 ఏళ్ల బాలిక ఐదో తరగతి చదువుతోంది. ఆమె చదువుతున్న స్కూళ్లో అరవింద్ కుమార్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తుండగా అభిషేక్ కుమార్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 2018 సెప్టెంబర్‌లో బాలికపై ఉపాధ్యాయుడి సహాయంతో ప్రిన్సిపాల్ అత్యాచారం చేశాడు. బాలిక కొన్ని రోజుల తరువాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలిక గర్భవతి అని తేలడంతో కూతురును తల్లి నిలదీయడంతో అసలు సంగతి తెలిపింది. తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్‌తో ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు సంబంధించి కోర్టు ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష అమలు చేయడంతో పాటు లక్ష రూపాయలు జరిమానా కోర్టు విధించింది. ప్రిన్సిపాల్‌కు సహకరించిన ఉపాధ్యాయుడికి యాబై వేల రూపాయల జరిమానాతో పాటు జీవిత ఖైదు కోర్టు విధించింది.
బాలికపై అత్యాచారం… ప్రిన్సిపాల్ కు ఉరిశిక్ష
- Advertisement -
- Advertisement -
- Advertisement -