Saturday, March 1, 2025

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

సికిందరాబాద్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో సోమవారం విషాదం చో టుచేసుకుంది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విరాన్ జైన్ అనే ఆరవ తరగతి విద్యార్థి చపాతీ రోల్ చేసుకొని తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస ఆడక అపస్మార స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కాగా, ఆకస్మికంగా తమ కుమారుడు మృత్యువాతపడటంతో మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News