Monday, December 23, 2024

పుణెలో మరో హిట్ అండ్ రన్ కేసు.. స్కూలు విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

పుణె: పుణెలోని కళ్యాణి నగర్‌లో శనివారం ఉదయం కారు స్పీడ్‌గా వచ్చి ఢీకొనడంతో స్కూల్ విద్యార్థి శాశ్వత్ రామ్ బొగాడే (15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కళ్యాణి నగర్ లోని కుమార్ తిరుపతి సొసైటీ నివాసి. కారు డ్రైవర్ రవికాంత్ గౌర్ (37)ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఎర్వాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

నిందితుడు విమన్ నగర్‌కు చెందిన వాడు. మృతుడు శాశ్వత్ సైకిలుపై స్కూలుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. దర్యాప్తులో కారు డ్రైవర్ మద్యం సేవించలేదని బయటపడిందని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర షేల్కే చెప్పారు. పుణెసతారా హైవేపై గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో హిట్ అండ్ రన్ సంఘటన జరిగి ఒకరు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News