- Advertisement -
నారాయణపేట ప్రతినిధి : పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాఠశాల హెడ్మాస్టర్ ,సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నారాయణపేటలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు పరిశీలించారు. గ్రౌండ్‌లో పరిసర ప్రాం తాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెడ్మాస్టర్‌ను ఆదేశించారు.
డిడబ్లూఓ, సిడిపిఓ కార్యాలయాలను కొత్తగా నిర్మిస్తున్న భవనంలోకి 15 రోజులలోపు మార్చాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఈవీఎం గోదాంని నెలవారి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, ఆర్డీఓ రాంచందర్, ఎఓ నర్సింగ్‌రావు, తహసీల్దార్ సిబ్బంది, డిడబ్లూఓ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -