Wednesday, January 29, 2025

స్కూల్ స్వీపర్లకు కనీస వేతనం ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

జనగామ ప్రతినిధి : ప్రభుత్వ ప్రైమరీ హైస్కూళ్లలో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొంత మంది స్వీపర్లకు రూ.1600, మరికొందరికి రూ.4వేలు ఇస్తూ వారిచే వెట్టిచాకిరి చేయించుకుంటుందని, వారిని పర్మినెంట్ చేసి కనీస వేతనాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.కనకారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జనగామలో స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూళ్లలోనే ఉండి పనిచేస్తోన్న వీరికి రూ.27వేల చొప్పున కనీస వేతనం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, నాయకులు ఆర్.మీట్యానాయక్, దూసరి నాగరాజు, టి.దేవదానం, కె.లింగం, మద్దోజు రామచొక్కం, ఆనందం, టి.గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News