Sunday, December 22, 2024

లారీ ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

- Advertisement -
- Advertisement -

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది.  ఎస్‌ఐ రవినాయక్ కథనం ప్రకారం యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన బట్టు శ్రీరాములు(40) ఇంజాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

ఆదివారం తన స్వగ్రామం నుంచి కుదాస్‌పల్లిలోని తన అక్క వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలోని రంగాపూర్ ఎక్స్‌రోడ్ వద్దకు రాగనే లోయపల్లి నుంచి లింగంపల్లికి వెళుతున్న లారీ అతి వేగంగా ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనం పై నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని శవ పరీక్ష నిమిత్తం ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News