Thursday, September 19, 2024

పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో టీచర్‌ను కాల్చి చంపిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలోగల గొండ్‌పల్లి గ్రామంలో పోలీస్ ఇన్‌ఫార్మర్ అన్న అనుమానంతో 25 ఏళ్ల స్కూల్ టీచర్‌ను నక్సల్స్ ఆదివారం చంపారు. శిక్ష దూత్ (తాత్కాలిక టీచర్)గా పనిచేస్తున్న డోడి అర్జున్‌ను నక్సల్స్ జన్‌అదాలత్ (కంగారూ కోర్టు) నిర్వహించి తీవ్రంగా హింసించడమే కాక, అతని గొంతుకోసి చంపారు. మావోయిస్టులకు గట్టిబలం ఉన్న జాగర్‌గుండ ఏరియాలోని స్కూలులో టీచర్‌గా అర్జున్ పనిచేస్తున్నాడు.

నక్సల్స్ బెదిరింపులతో గత కొన్నేళ్లుగా మూతపడిన స్కూళ్లను అర్జున్ తెరిపించడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో యాంటీ నక్సల్స్ డ్రైవ్ తీవ్రం కావడంతోబస్తర్ ఏరియాలో నక్సల్స్ పట్టు కోల్పోయారు. దీంతో తీవ్ర నిస్పృహతో ప్రజలను లక్షంగా నక్సల్స్ చేసుకోవడం ప్రారంభించారు. దాని పర్యవసానమే ఈ సంఘటన. దీంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ఒక బృందం ఆ ప్రదేశానికి వెళ్లి నక్సల్స్ కోసం గాలింపులు ప్రారంభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News