Wednesday, January 22, 2025

పాఠశాలల పని వేళలు మార్పు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 4.45కి బదులుగా 4.15 గంటలకు పనివేళలు ముగుస్తాయని తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంటనగరాలలో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశల విద్యాశాఖ సంచాలకులు ఇవి నరసింహారెడ్డి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News