Tuesday, November 26, 2024

చిన్నారులను చిదిమేసిన స్కూల్ బస్సు

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడలో
దుర్ఘటన ఇద్దరు చిన్నారుల మృతి
కుటుంబసభ్యుల ఆందోళన రూ. 15లక్షల
పరిహారం చెల్లించడానికి స్కూల్
యాజమాన్యం అంగీకారం

మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: స్కూల్ వ్యాన్ ఢీకొని చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో బాలుడు దవాఖానాలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని శేరిగూడ గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన కుటుంబీకులు శేరిగూడలోని రైస్‌మిల్లులో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం తమ తల్లిదండ్రులు పనిచేస్తున్న రైస్‌మిల్లు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు బయట గేటు వద్ద నిల్చున్నారు.

ఇబ్రహీంపట్నంలోని ఆంగ్లిష్టు స్కూల్‌కు చెందిన వ్యాను శేరిగూడ నుంచి ఇబ్రహీంపట్నం వైపు యూ టర్న్ చేసుకుంటుండగా, డ్రైవర్ నిర్లక్షం కారణంగా సాగర్ రహదారి పక్కనే నిల్చున్న కాజల్(8), అభిషేక్(10) తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కాజల్ అక్కడికక్కడే మృతిచెందగా, అభిషేక్ తీవ్ర గాయాలపాలవటంతో దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి దీంతో కుటుంబీకులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేదనిలేదని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు రోడ్డుపై భైఠాయించారు.

ఆందోళతో సాగర్ రహదారి గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్కూల్ యాజమానిని పిలిపించి మృతుల కుటుంబీలకు న్యాయం చేయాలని తెలియజేయటంతో, ఆంగ్లిష్టు స్కూల్ యజమాని రూ.15లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలపటంతో ఆందోళన విమరించారు. దీంతో పోలీసులు స్కూల్ బస్ డ్రైవర్‌పైనా కేసు నమోదు చేసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News