Friday, December 20, 2024

నేడు పాఠశాలల బంద్

- Advertisement -
- Advertisement -

గద్వాల టౌన్: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు(సోమవారం) ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీష్ తెలిపారు. ఆదివారం గద్వాల పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సురేష్, వెంకటేష్, నరేష్, వంశీ, తేజ, సాగర్, మహేష్, అనీల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News