న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాల్లో పాఠశాలలు పూర్తిగా తెరుచుకున్నాయి, 16 రాష్ట్రాల్లో ఉన్నత తరగతులు మాత్రం తెరుచుకున్నాయి. కాగా తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికీ పాఠశాలలు మూతపడే ఉన్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా పాఠశాలల స్థాయి గురించి వారు వివరాలు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో బోధన, బోధనేతర సిబ్బంది దాదాపు 95 శాతం మేరకు వ్యాక్సిన్ చేయించుకున్నారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే నూరు శాతం సిబ్బంది వ్యాక్సిన్ చేయించుకున్నారని కూడా తెలిపారు. “వ్యాక్సినేషన్ కవరేజి విస్తృతంగా చేపట్టాక కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2021 డిసెంబర్‌లో సవరించిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు జారీచేసింది. తల్లిదండ్రుల ఆమోదాన్ని కూడా తీసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్రాలకు సూచించడం జరిగింది”అని విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి స్వీటీ చంగ్‌సన్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
11 రాష్ట్రాల్లో పూర్తిగా తెరుచుకున్న పాఠశాలలు!
- Advertisement -
- Advertisement -
- Advertisement -