Monday, December 23, 2024

పాఠశాలలకు సెలవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన గురునానక్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు పాఠశాలలు సోమవారం సెలవు ప్రకటించాలని నిర్ణయించాయి. ఇదిలావుండగా, తెలంగాణ ప్రభుత్వం కూడా నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించింది.

గురునానక్ జయంతి లేదా గురునానక్ దేవ్ జీ గురుపురబ్ నాడు, సిక్కు సంఘం మొదటి సిక్కు గురువు గురునానక్ జన్మదినాన్ని జరుపుకుంటుంది. సిక్కు మత స్థాపకుడు, ఒక సిక్కు గురువు గురునానక్‌ను సిక్కు సమాజం ఎంతో గౌరవిస్తుంది. సిక్కు మతంలో పవిత్ర పండుగ అయిన గురునానక్ జయంతి సందర్భంగా పలు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News