Friday, November 15, 2024

నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సెలవుల పొడిగింపుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ఉత్తర్వులు నమ్మొద్దు
పాఠశాల విద్యాశాఖ ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలో నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సెలవులు మరిన్ని రోజులు పొడిగించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ఉత్తర్వులను పట్టించుకోవద్దని పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి స్పష్టమైన ప్రకటన చేసింది. సోమవారం నుంచి స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభమవుతాయని, తల్లిదండ్రులు, టీచర్లు, సిబ్బంది ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇందుకు సంబధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయగా ప్రైవేట్ పాఠశాలలు మాత్రం 15 రోజుల ముందే ఏర్పాట్లు చేసి గత రెండు, మూడు రోజుల నుంచి పాఠశాల పునఃప్రారంభం తేదీ స మాచారాన్ని విద్యార్థులు తల్లిండ్రులకు మెసెజ్‌లో రూపంలో తెలియచేశాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా అత్యధితక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రుల సంఘాలు పాఠశాలల పునఃప్రారంభాన్ని మరో వారం రోజులు వాయిదావేయాలని కోరుతున్నాయి.

ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఉన్నతాధికారులకు పలు విజ్ఞప్తులు చేసినట్లు సమాచారం. గత శనివారం వరకు హైదరాబాద్‌లో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయిన సంగతి తెలిసింది. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల సమయాలపై కూడా ఆందోళన చెందుతున్నారు.పాఠశాలల ప్రారంభం తేదీని మార్చక పోయినా కనీసం మరో వారం రోజుల పాటు ఒంటిపూట బడి ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరుతున్నారు. గతంలో జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే 288 రోజుల క్యాలండర్‌ను విద్యాశాఖ జారీ చేసిందని, అయితే అకడమిక్ క్యాలండర్‌ను ఫిక్స్ చేయడంతో పాఠశాలల పునః ప్రాంభం తేదీని వాయిదా వేసే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News