- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం అధికారికంగా ప్రకటించారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. స్కూళ్ల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగున్న నేపథ్యంలో సెలవులను జనవరి 31 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు,కాలేజీలు మళ్లీ తెరుచుకోనున్నాయి. తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
- Advertisement -