Sunday, December 22, 2024

బడికి వేళాయె

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం మారిన
పనివేళలు ఉ.9.30 నుంచి సా.4.15 వరకు
ప్రైమరీ స్కూళ్లు, ఉ.9.30 సా.4.45 వరకు హైస్కూళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి ఈ నెల 11 వరకు వేసవి సెలవులు కొనసాగాయి. మంగళవారంతో వేసవి సెలవులు ముగియడంతో పాటు పిల్లలు మళ్లీ బ డిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్షంగా ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విద్యాశాఖ నిర్వహిస్తోంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19 వరకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తారు. బడిబయట పిల్లలను గుర్తించి, వారిని సమీపంలోని అంగన్‌వాడీలు, పాఠశాలల్లో చేర్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెం చ డం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించడం బ డిబాట ఉద్దేశ్యం. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ‘ఇంగ్లిష్ మీడియం బోధన’ వంటి అంశాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫాం వంటివన్నీ సమకూరుతాయని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి కూడా గత విద్యాసంవత్సరం తరహాలోనే అందుబాటులో ఉన్న  ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి విద్యావలంటీర్లను ఉండదని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభు త్వం డిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిం దే. అయితే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉం ది. ఉపాధ్యాయుల నియామకం జరిగినా ఈ విద్యాసంవత్సరం దాదాపు సగం పూర్తయిన తర్వాతనే కొ త్త టీచర్లు బోధించే పాఠశాలల్లో బోధించనున్నారు.

రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మారుస్తూ ప్రభు త్వం ఇదివరకే నిర్ణయం తీసుకున్నది. గతంలో ఉద యం 9 గంటలకు పాఠశాలలు మొదలవుతుండగా,ఆ సమయాన్ని 9.30 గంటలకి మార్పు చేశా రు. ప్రాథమిక పాఠశాలల సమయం ఉదయం 9. 30 నుంచి సాయంత్రం 4.15 వరకు మారగా, ఉన్న త పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు మారింది. ఈ పని వేళలు జంట నగరాలకు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించనున్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పెరిగిన ప్రైవేట్ స్కూల్ ఫీజులు

ప్రైవేట్ స్కూల్ ఫీజులు 20 శాతానికి పైగా పెరిగా యి. కొత్తగా ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు పాఠశాలలు ప్రారంభమయ్యేలోగానే మొదటి విడత ఫీ జులు వసూలు చేస్తున్నాయి. బుక్స్, యూనిఫాం, షూస్, రవాణా ఫీజులు అదనం. ఫీజులకు అదనం గా ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం పేరుతో స్కూల్ స్థాయి ని బట్టి, బస్సుల్లో సదుపాయాలను బట్టి ఒక్కో విద్యార్థిపై దూరాన్ని బట్టి నెలకు రూ. వెయ్యి నుంచి రూ. 4,000 వరకు వసూలు చేస్తున్నారు. మొదటిసారి స్కూళ్లో చేరితే తప్పనిసరిగా డొనేషన్ కట్టాలి. ఇది స్కూల్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు.
ఆలియా స్కూల్‌కు మంత్రి పొన్నం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా బుధవా రం నాడు ఉదయం 9.30 గంటలకు అబిడ్స్‌లోని జిఎంహెచ్‌ఎస్ అలియా స్కూల్‌ను రాష్టర రవాణా, బిసి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News