హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో జులై 1నుంచి అన్నికేటగిరిల విద్యాసంస్థలను పూర్తి స్థాయి సన్నద్ధతతో ప్రారంభించాలని విద్యాశాఖను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే విద్యార్దులను స్కూళ్లకు పంపాల, వద్దా అనేది తల్లితండ్రుల నిర్ణయానికే వదిలేశారు. విద్యార్ధులు తప్పనిసరిగా స్కూళ్లకు రావాలని యాజమాన్యాలు బలవంతపెట్టకూడదని మంత్రివర్గం ఆదేశించింది. పాఠశాలకు రాని విద్యార్ధులు ఆన్‌లైన్ తరగతుల్లో హాజరు కావచ్చని మంత్రిమండలి సూచించింది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు వేసవి సెలవులను ఈ నెల 30వరకూ పొడిగిస్తున్నట్టు తెలిపారు .జూలై 1 అన్ని కళాశాలలను తిరిగి ప్రారంభించాలని ఇంట్ బోర్డు కార్యదర్శి ఈ మేరకు ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు.
Schools rusume from July 1 in Telangana