Thursday, January 23, 2025

నేటి నుండి బడులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

గద్వాల : వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం సోమవారం నుంచి జరగనుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 12 నుంచి తెరుచుకోనున్నాయి. పాఠశాలలను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేసి విద్యార్థులను ఆకర్షించే విధంగా తయారు చేశారు.

ఈ నెల 14 నుంచి బడిబాట పట్టి బడి ఈడు గల పిల్లలను బడులలో చేర్పించేందుకు పాఠశాల హెడ్మాస్టర్, గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ యువతి యువకులు గ్రామంలో పర్యటించి బడీలు పిల్లలను బడిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్య మధ్యహ్న భోజనం దుస్తులు పాఠ్య పుస్తకాలు అందజేయబడతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడులలో చేర్పించాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు , మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఉండగా విద్యా భోదన పాఠ్య పుస్తకాలు కంప్యూటర్లు ల్యాబ్ తలసర ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక మన ఊరు మన బడి కార్యక్రమం కింద నిర్మించిన అదనపు భవనాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్ది విద్యార్థుల రాక కోసం ఎదురు చూస్తున్నాయి.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభోదన కొనసాగించేందుకు ఇప్పటికే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ భోదనపై రఘు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిం చడం జరిగింది. అక్షరాస్యతలో వెనుకబడిన జోగులాంబ గద్వాల జిల్లాను ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News