- Advertisement -
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభించడంలేదని విద్యాశాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా తెలిపారు. ప్రత్యక్ష తరగతితో పాటు ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించాలని విద్య సంస్థలకు సూచించారు. పిల్లల్ని స్కూల్కు పంపాలని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకరావొద్దన్నారు. తల్లిదండ్రుల నుంచి ఎలాంటి డిక్లరేషన్ తీసుకోకూడదని హెచ్చరించారు. రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయి. అన్ని ప్రభుత్వ బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ విద్యాలయాలు మినహా అన్ని స్కూల్స్ తరగతులు రేపటి నుంచి ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతులకు అనుమతి ఉంది.
- Advertisement -