Sunday, December 22, 2024

జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ 2024 -25 విద్యాసంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. 2025 ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఏప్రిల్ 24 నుంచి 11 జూన్ వరకు వేసవి సెలవులుగా నిర్ణయించారు. మార్చిలో పదో తరగతి వారికి తుది పరీక్షలు ఉంటాయని తెలిపిన పాఠశాల విద్య కమిషనర్ 28 ఫిబ్రవరి లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 2 అక్టోబర్ 2024 నుంచి 14 వరకు 13 రోజులు దసరా, 23 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్ 2024 వరకు క్రిస్మస్, 2025 జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 23 చివరి పనిదినంగా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత పాఠశాలలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు తరగతులు నిర్వహించనుండగా, అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు నిర్వహించాలని అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

2024 25 విద్యాసంవత్సరం క్యాలెండర్ వివరాలు

అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు
డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు క్రిస్మస్ సెలవులు
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
2025 ఫిబ్రవరి 28 లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు
2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు
2025 ఏప్రిల్ 23 చివరి పనిదినం
ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలల సమయం
అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News