Monday, December 23, 2024

నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : జిల్లాలో జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం చేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవుల తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 నుంచి ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ 2023, 24 విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పనిచేస్తాయని తెలిపారు. సెలవులలో ఆటపాటలలో ఆనందంగా గడుపుతున్న పిల్లలు మళ్లీ పాఠశాలకు బయల్దేరాల్సిన సమయం వచ్చిందని తెలియజేసేందుకు జూన్ 3 నుండే ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 825 పాఠశాలల్లో 70 వేల మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఇప్పటికే మండలాలకు పాఠ్యపుస్తకాలను చేరవేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి పాఠశాలలో ఈ నెల 20వ తేదిన విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యా దినోత్సవం రోజు పాఠశాలకు 100 శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకుని విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు నోట్ పుస్తకాలను సైతం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News