Saturday, November 23, 2024

సైన్స్ & టెక్నాలజీ

- Advertisement -
- Advertisement -

Science and technology question and answers

ధ్వని: 

 కంపిస్తున్న వస్తువులు ధ్వనులు ఉత్పత్తి చేస్తాయి. ధ్వని యాంత్రిక శక్తి స్వరూపం. అందుకే ధ్వని ప్రసారానికి యానకం అవసరం.
ధ్వని ప్రసారమయ్యేటప్పుడు యానకంలోని అణువుల స్థానంలో మార్పురాదు. శక్తి మాత్రమే ప్రసారమవుతుంది.
ధ్వని ప్రసారం జరిగే యానకానికి 1. స్థితి స్థాపకత, 2. జడత్వం అనే ధర్మాలు ఉంటాయి.
శూన్యంలో యానకం ఉండదు. శూన్యంలో ధ్వని తరంగాలు ప్రయాణించలేవు.
శూన్యంలో ధ్వని వేగం ‘0’
పైథాగరస్ అనే శాస్త్రవేత్త ధ్వని గాలిలోని అణువులు ముందుకీ వెనక్కీ కదలడం ద్వారా ధ్వని ప్రయాణించి చెవిని చేరి, గ్రహణ సంవేదన కల్గిస్తుందని పేర్కొన్నాడు.
గెలిలీయో, బేకన్‌లు దీనిని అంగీకరించారు.
న్యూటన్ మొదటిసారి గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించాడు.
ప్రయోగశాలలో ధ్వనిని శృతి దండం సహాయంతో ఉత్పత్తి చేస్తారు.
శృతి దండాన్ని జాన్‌షోర్ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. శృతి దండపు కీచుదనం (పిచ్) దాని భుజాల పొడవుపై ఆధారపడి ఉంటుంది.
శబ్ద తీవ్రతను డెసిబెల్ లలో కొలుస్తారు
మానవుని చెవులు 9 డెసిబెల్స్ నుండి 180 డెసిబెల్స్ వరకు వింటాయి.
సాధారణ శబ్ద తీవ్రత 50 60 డెసిబెల్స్.
విమానం శబ్ద తీవ్రత 80 డెసిబెల్స్
జెట్‌విమానం శబ్ద తీవ్రత 120 డెసిబెల్స్
పచ్చికబయళ్ల శబ్ద తీవ్రత 0 డెసిబెల్స్
ధ్వని పీడనం చదరపు సెం.మీకు 0.0002 డైన్లు.
ధ్వని తరంగ లక్షణాలు : 4
1.తరంగధైర్ఘం
2.కంపన పరిమితి
3. పౌనఃపున్యం
4. తరంగ వేగం
తరంగ దైర్ఘం పోడవును సూచిస్తుంది.
తరంగదైర్ఘం ఎస్‌ఐ ప్రమాణం మీటర్

కంపన పరిమితి
యానకంలోని కణాలు వాటి మధ్య స్థానం నుంచి ఇరువైపులా పొందే గరిష్ట అలజడిని కంప పరిమితి అంటారు.
దీనిని aతో సూచిస్తారు.
ఆవర్తన కాలం.. పౌనఃపున్యం
ధ్వని ప్రసారంలో యానకపు సాంద్రత ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టిన కాలం ఆవర్తన కాలం అంటారు.
ధ్వని ప్రసారంలో యానకపు సాంద్రత ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టిన కాలం ‘ ఆవర్తన కాలం ’ అంటారు.
ఆవర్తన కాలాన్ని Tతో సూచిస్తారు.
ఎస్‌ఐ ప్రమాణాలు : సెకన్‌లు
ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.
ఎస్‌ఐ ప్రమాణాలు : హెర్ట్ (HZ)
పౌనఃపున్యం = 1/ ఆవర్తన కాలం = 1/T

ధ్వని వేగం:

తరంగంపై ఉన్న ఏదైనా ఒక బిందువు ప్రమాణ కాలంలో ప్రయాణించి దూరాన్ని వేగం అంటారు.
ధ్వనివేగాన్ని ప్రభావితం చేసే అంశాలు: ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత, ఆర్ధ్రత.
ఉష్టగ్రత: వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది.
పీడనం: వాయువులలో పీడన ప్రభావం ఉండదు.
ఘన, ద్రవ పదార్థాలలో పీడనం పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది.
సాంద్రత: గాలిలో ధ్వనివేగం దాని సాంద్రత (d) ఎక్కువ. కావున ధ్వని వేగం తక్కువ. ఉదా: co2 , so2
వాతావరణంలో మనకు లభించే వాయువుల్లో అన్నింటికంటే తేలికైన హైడ్రోజన్ వాయు సాంద్రత తక్కువగా ఉంటుంది.
దీంతో హైడ్రోజన్ వాయువులో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది.
అనేక వాయువుల మిశ్రమం అయిన గాలి సాంద్రత ఎక్కువగా ఉండటం వలన గాలిలో ధ్వని వేగం 330మీ/సెకన్‌గా ఉంటుంది.
తేమ/ఆర్ద్రత: వతావరణంలో గల నీటి ఆవిరి శాతంను తేమ లేక ఆర్ద్రత అంటారు.
తేమ శాతం పెరిగితే వాయు సాంద్రత తగ్గి ధ్వనివేగం పెరుగుతుంది. అందువల్ల తేమశాతం ఎక్కువగా ఉన్న వర్షాకాలంలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది.
అతిధ్వనులు-ఉపయోగాలు
పాలు శుభ్రపరిచే ప్రక్రియలో
ఇకో కార్డియోగ్రఫీ
అల్ట్రా శుక్లాల చికిత్స (కంటి శుక్లాల చికిత్స)
తల్లి గర్భంలోని భ్రూణం పెరుగుదల తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
ధ్వని తరంగాలు చెవిలో కర్ణబేరిని కనీసం 1/10 సెకన్లపాటు తాకితే వినికిడి జ్ఞానం కలుగుతుంది.
ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరం.
ఎటువంటి యానకంలేని విశ్వాంరాలంలో చంద్రుడిపై భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలలో ధ్వనివేగం శూన్యం.
ధ్వనిని గురించి అధ్యయనం చేయు శాస్త్రం అకౌస్టిక్సీ.
సూపర్ సోనిక్ వేగం
ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉన్న వేగాన్ని సూపర్ సోనిక్ వేగం అంటారు.
విమానాలు, జెట్ విమానాలు, రాకెట్‌లు, క్షిపణులు, యుద్ధ వాహన నౌకలు సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి.
సూపర్ సోనిక్ విమాన వేగం గంటకు సుమారు 1200 km లేదా ౩౩౦మీ/సెకన్‌తో ప్రయాణిస్తుంది.
జెట్ విమానాలు, సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించినప్పుడు అత్యంత శక్తివంతమైన షాక్‌వేవ్స్ అనే ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తాయి.

సంగీతం:

తీగ వాయిద్యాలు సితార్, వీణ
డప్పు వాయిద్యాలు మృదంగం, డప్పు, తబలా..
వాయు వాయిద్యాలు పిల్లనగ్రోవి, హార్మోనియం.
సంగీత ధ్వనుల లక్షణాలు
1. పిచ్, 2.తీవ్రత, 3. నాణ్యత
పిచ్: పనఃపున్యంపై ఆధారపడుతుంది.
పౌనఃపున్యం ఎక్కువైతే పిచ్ ఎక్కువవుతుంది.
తీవ్రత: వసువులుపై ప్రయోగిచే బలంపై ఆధారపడుతుంది.
దీనిని కంపన పరిమితితో వివరిస్తారు.
శబ్ద తీవ్రతను డెసిబెల్స్‌లలో కొలుస్తారు.
నాణ్యత: ఒకే పౌనఃపున్యం, తీవ్రత ఉన్న రెండు సంగీత స్వరాలు, రెండు వేర్వేరు వాయిద్యాల నుండి వెలువడినప్పుడు వాటి మధ్య భేదాన్ని తెలియజేసే స్వరలక్షణాన్ని నాణ్యత అంటారు. నాణ్యత, తరంగరూపంపై ఆధారపడుతుంది.

ప్రతిధ్వని: 

ఒక పరిశీలకుడు ఉత్పత్తి చేసిన ధ్వని, పరావర్తనం చెందితే ఆ ధ్వనిని ప్రతిధ్వని అంటారు.
ధ్వని పరావర్తనం ఉపయోగాలు
విమానం ఎత్తును, సముద్రపు లోతును కనుగొనవచ్చు.
సోనార్ పద్ధతిలో ఉపయోగిస్తారు.
లౌడ్ స్పీకర్, స్టెతస్కోప్‌లు పరావర్తనంతో పనిచేస్తాయి.
శ్రవ్య అవధి: పౌనఃపున్య అవధి 20 hz 20000 hz వరకు ఉన్న ధ్వనులు.
20hz కంటే తక్కువ ధ్వనులను పరశ్రావ్యాలు అనీ, 20,000 hz కంటే ఎక్కువ ధ్వనులను అతిధ్వనులు అని అంటారు.
ఏనుగులు, తిమింగలాలు, ఖడ్గమృగాలు పరశ్రావ్యాలను గుర్తించి. భావవ్యక్తీకరణ చేస్తాయి.
కుక్కలు 50 వేల hz, గబ్బిలాలు ఒక లక్ష hzల వరకు అతి ధ్వనులను వినగలవు.

26న గ్రూప్ 1, గ్రూప్ 2పై ఉచిత అవగాహన సదస్సు

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం క్రిష్టప్రదీప్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అకాడమీ ఛైర్మన్ క్రిష్టప్రదీప్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అశోక్‌నగర్‌లోని తమ అకాడమీలో నిర్వహించనున్న ఈ ఉచిత అవగాహన సదస్సులో సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, నోట్స్ మేకింగ్, సమయపాలన తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర పూర్తి వివరాలకు 040 35052121/ 91332 37733 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News