- Advertisement -
దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.4గా శ్రవణ్ రెడ్డి, రియా కపూర్ ప్రధాన పాత్రలలో వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భారతదేశపు మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా రూపొందిస్తున్నారు. శ్యామ్ దేవభక్తుని నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి అజయ్ ఘోష్ క్లాప్ కొట్టగా సుహాస్ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమినీ కిరణ్ స్క్రిప్ట్ అందించగా తొలి సన్నివేశానికి వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వం వహించారు. సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన సన్నివేశాలను వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు.
- Advertisement -