Friday, December 20, 2024

అందరికీ సైన్సు ఫలాలు అందాలి

- Advertisement -
- Advertisement -
ఎఐపిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ రాజింవాలె

హైదరాబాద్ : సమాజంలోని అందరికి సైన్సు ఫలాలు అందాలని ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ ఫోరం (ఎఐపిఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ రాజింవాలె అన్నారు. సైన్సులో ప్రధానంగా భౌతిక శాస్త్రంలో అనేక కొత్త మార్పులు చేటు చేసుకున్నాయని వెల్లడించారు. శాస్త్రీయ దృక్పథాన్ని సైన్సు ఆలోచనను సమాజంలోని అన్ని వర్గాల్లో పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఎఐపిఎఫ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయం, ఎస్.ఎన్.రెడ్డి భవన్, హిమాయత్‌నగర్‌లో ‘ఇన్ డిఫెన్స్ ఆఫ్ సైంటిఫిక్ ఆట్‌లుక్‌’ అన్న అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనిల్ రాజింవాలె మాట్లాడుతూ సైన్సు 19వ శతాబ్ధం నుంచి సైంటిస్టు న్యూటన్ నుంచి కొత్త పుంతలు తొక్కిందని స్పష్టంచేశారు.

వస్తువుల ఉత్పత్తితో పాటు పంపిణీ కూడా సమానంగా జరగాల్సి వుందన్నారు. శాస్త్రీయ దృక్పధాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎఐపిఎఫ్ ఏ రాజకీయ పార్టీకి చెందింది కాదని స్పష్టం చేశారు. భౌతిక శాస్త్రంలో చలన సిద్దాంతం నూతన ఒరవడికి నాందిపలికిందని అన్నారు. అణువు నుండి చోదక శక్తులు పెనుమార్పులు తెచ్చాయని సైన్సులో కొత్త ఆవిష్కరణలకు బాటలు వేశాయని అన్నారు. గతంలో కంటే మేధా శక్తి పెరిగిందని, కంప్యూటర్ రంగంలో నూతన మార్పులు చేటుచేసుకున్నాయని దైనందిన జీవితంలో కంప్యూటర్‌తో కొత్త మార్పులు వస్తాయని ఆయన చెప్పారు. విద్యా పరంగా అభివృద్ధి చెందినప్పటికీ శాస్త్రీయ, సైన్సు ఆలోచన కూడా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

సైన్సును పాఠ్యంశాల నుంచి తొలగించటంపట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సైన్సు, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో అలవర్చుకోవల్సిన అవసరం ఉందని పారిశ్రామిక రంగంలో టెక్నాలజీ ఒక విప్లవాన్ని సృష్టించిందని అన్నారు. పారిశ్రామిక విప్లవం తరువాత అనేక మార్పులు వచ్చాయని, యాంత్రీకరణ వినియోగం పెరిగిందని అన్నారు. నేటి ఆధునిక యుగంలో సైన్సు భౌతిక శాస్త్ర ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. డార్విన్, మారక్స్ సిద్దాంతాలు శాస్త్రీయమైన సిద్దాంతాలని వాటిని అనుసరించాలని సూచించారు. మంత్ర శక్తితో వ్యాధులు నయంకావని శాస్త్రీయ పద్దతుల్లోనే వ్యాధులు నయమవుతాయని అన్నారు. మతం, మూఢనమ్మకాలు శాస్త్రాలు కావని చెప్పారు.

శాస్త్రం ఒక్కటే విశ్వానికి ఉపయోగపడుతుందని అన్నారు. సైన్సును సమస్త మానవాళి అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాఠ్యాంశాలను తొలగిస్తే పశ్నించే తత్వం పొతుందని పాలకులు అనేక పాఠ్యాంశాలను తొలగించారని అన్నారు. ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు డా యుగలు రాయ్‌లు మాట్లాడుతూ అశాస్త్రీయమైన మూఢ నమ్మకాలను నమ్మకూడదని హితవు పలికారు. న్యూటన్ జడత్వ సిద్ధాంతం సైన్సులో కొత్త పుంతలు తొక్కిందని స్పష్టం చేశారు.

విప్లవాత్మకమైన శాస్త్రాన్ని న్యూటన్ కనుగొన్నారని, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం పృధ్వీలో ఉన్నవారు ఒక్కటేనని అన్నారు. బైబిల్, గీత, ఖురాన్ కంటే డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతమే శాస్త్రీయమైందని స్పష్టం చేశారు. సోమమర్ల మాట్లాడుతూ స్కూల్ స్థాయిలో విద్యార్థులు సైన్సును అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సముద్ర గర్భం నుంచే జీవరాశులు వచ్చాయన్నారు. 107 మూలకాలను డార్విన్ కనిపెట్టారని గుర్తు చేశారు. డార్విన్ మూలాలు ఖనిజాలకు ఉపయోగపడ్డాయన్నారు. జింక్, ఐరన్ వంటివి శక్తినిస్తాయని ఈ అంశాన్ని డార్విన్ పేర్కొన్నారన్నారు. శాస్త్రీయతను, మూల సైన్సును, జ్ఞానాన్ని పిల్లల్లో పెంచాలని కోరారు. ఎఐపిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రజని అధ్యక్షత వహించగా, ఎఐపిఎఫ్ నాయకులు వి.యస్.బోస్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సులో పలువురు ప్రస్తావించిన అంశాలను అనిల్ రాజింవాలె, యుగల్‌చాయ్‌లు నివృత్తి చేశారు. కార్మిక, విద్యార్థి, సామాజిక శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News