Monday, December 23, 2024

శాస్త్రోక్తంగా నృసింహుని గరుడవాహన సేవ

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట మఠంపల్లి మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకళ్యాణోత్సవాన్ని అర్చకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీస్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించి కళ్యాణ మండపంలో కళ్యాణతంతు నిర్వహించారు.

అనంతరం ఆలయ పురవీధులలో గరుడవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్,మట్టపల్లిరావు,ఈఓ నవీన్,పాలకమండలి సభ్యులు అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News