- Advertisement -
న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని శాస్త్రి భవన్‌కు చెందిన ఏడవ అంతస్తు నుంచి దూకి కేంద్ర సమాచార, టెక్నాలజీ మంత్రిత్వశాఖలో పనిచేస్తున్న ఒక 55 ఏళ్ల శాస్త్రవేత్త సోమవారం మరణించారు. మృతుడిని పశ్చిమ ఢిల్లీలోని పీరాగఢిలో నివసించే రాజేష్ మల్లిక్‌గా పోలీసులు గుర్తించారు. అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖ కార్యాలయాలు ఉన్న శాస్త్రి భవన్‌లోని రెండవ గేట్ ఎదుట మల్లిక్ మృతదేహం లభించింది. శాస్త్రి భవన్ పైనుంచి ఒక వ్యక్తి కిందకు దూకినట్లు సమాచారం అందిన వెంటనే పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారుల బృందం అక్కడకు చేరుకుందని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని డిసిపి(న్యూఢిల్లీ) అమృత గురులోత్ తెలిపారు.
- Advertisement -