Monday, December 23, 2024

శాస్త్రవేత్త కెవిఆర్ చారి సేవలు మరువలేనివి: వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

Scientist KVR Chari's services are unforgettable: Vinod Kumar

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కెవిఆర్ చారి దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం సోమాజిగూడలోని జయా గార్డెన్స్‌లో జరిగిన సంస్మరణ సభలో చారికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఐఐఎస్‌ఈఆర్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సీనియర్ ప్రొఫెసర్ గా చారి దేశానికి గొప్ప సేవలు అందించారని గుర్తుచేశారు. యువతరానికి చారి జీవితం ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News