Saturday, November 16, 2024

అతిభారీ నల్లబిలాలు ఒక్కటైన ఖగోళ అద్భుతాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

- Advertisement -
- Advertisement -

Scientists discover 3 supermassive black holes merging together

 

న్యూఢిల్లీ: మూడు అతిభారీ బ్లాక్‌హోల్స్(నల్లబిలాలు) ఐక్యమై ట్రిపుల్ యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్‌గా ఏర్పడుతున్న అరుదైన ఘటనను భారత ఖగోళ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. నూతనంగా కనుగొన్న పాలపుంత మధ్య భాగంలో బ్లాక్‌హోల్స్ ఐక్యమవుతున్న ఘటనను గుర్తించినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డిఎస్‌టి) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామం వల్ల ఆ పాలపుంత నుంచి అత్యధిక కాంతి విడుదలైందని తెలిపింది. బ్లాక్‌హోల్స్ అంటేనే అధిక ద్రవ్యరాశితో అతి తక్కువ స్థలాన్ని ఆక్రమించే శక్తి కేంద్రకాలు. వాటివైపు వెళ్లిన కాంతిని కూడా అవి లాగేసుకుంటాయి. దాంతో, అవి కనిపించవు. అయితే,వాటి సమీపంలోని ధూళి, వాయువుల్ని మింగేస్తాయి. ఆ సమయంలో వాటి నుంచి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ విడుదలవుతుంది. దాంతో, ఆ ప్రాంతంలో బ్లాక్‌హోల్స్ ఉన్నట్టు గుర్తిస్తారు. ఎన్‌జిసి 7733, ఎన్‌జిసి 7734, ఎన్‌జిసి 7733ఎన్ బ్లాక్‌హోల్స్ ఐక్యమయ్యే ఘటనను గుర్తించామని డిఎస్‌టి పేర్కొన్నది. ఈ ఘటన ఆ పాలపుంత తదుపరి పరిణామంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News