Friday, November 15, 2024

జైసల్మేర్‌లో అతి ప్రాచీన డైనోసార్ శిలాజం లభ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐఐటి రూర్కే, జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) శాస్త్రవేత్తలు దేశం లోని రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో చారిత్రాత్మకమైన పరిశోధనలు చేపట్టారు. పొడవాటి మెడ, మొక్కలు ఆహారం తీసుకునే అతి ప్రాచీన డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారు. ఈ డైనోసార్ శాస్త్రీయంగా డైక్రెయోసారిడ్ కుటుంబానికి చెందినది. అపూర్వమైన ఈ పరిశోధన డైనోసార్ పరిణామ చరిత్రలో భారత్ ప్రధాన పాత్ర వహించిందని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు లభించిన ఈ శిలాజ అవశేషాలు 167 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివని శాస్త్రవేత్తలు అంచనాగా చెబుతున్నారు.ధార్ ఎడారిలో ఈ డైనోసార్ శిలాజాలు లభించిన తరువాత ఈ డైనోసార్‌ను “థారోసారస్ ఇండికస్‌” గా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇంతవరకు ఈ డైనోసార్ తెగ గురించి శాస్త్రవేత్తలకు తెలియరాలేదు. డైక్రెయోసారిడ్ డైనోసార్ శిలాజాలు ఇప్పటివరకు ప్రపంచం లోని ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, చైనా లోనే లభ్యం అయ్యాయి. ఇంతవరకు భారత్‌లో మాత్రం వీటి శిలాజాలు లభ్యం కాలేదు.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2018 లో రాజస్థాన్ లోని జైసల్మేర్ రీజియన్‌లో మధ్యయుగ జురాసిక్ శిలల్లో శిలాజాల తవ్వకాలను ఒక క్రమ పద్ధతిలో చేపట్టడంతో ఇవి లభ్యమయ్యాయి. అప్పటి నుంచి ఐఐటి రూర్కెకు చెందిన వెర్టెబ్రేట్ పాలెయోంటాలజీ ఛైర్ ప్రొఫెసర్ సునీల్ బాజ్‌పాయ్, సహచర శాస్త్రవేత్త దేవజిత్ దత్తా కలిసి గత ఐదేళ్లుగా సమగ్రంగా ఈ శిలాజాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. ఇవి 167 మిలియన్ సంవత్సరాల నాటివని నిర్ధారించ గలిగారు. ఇది అత్యంత ప్రాచీన డైక్రెయోసారిడే కాకుండా ప్రపంచం మొత్తం మీద అతిప్రాచీన డిప్లొడొకోయిడ్ డైనోసార్‌గా కూడా గుర్తించారు. ఇదివరకటి అధ్యయనాలు అతిప్రాచీన డైక్రెయోసారిడ్ శిలాజం చైనాలో మాత్రమే 166 మిలియన్ సంవత్సరాల నాటిది లభ్యం అయిందని అనుకున్నారు. ఇప్పుడు భారత్‌లో కూడా అతిప్రాచీన డైనోసార్ శిలాజం లభ్యం కావడం చారిత్రక విశేషమే.
photo :

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News