Friday, November 15, 2024

చైనాలో మరో 18 ప్రమాదకర వైరస్‌లు

- Advertisement -
- Advertisement -

Scientists find 18 more viruses from China

అంతర్జాతీయ శాస్త్రవేత్తల గుర్తింపు

బీజింగ్ : కరోనా మహమ్మారికి మూలకేంద్రంగా చెప్పుకునే చైనాలో 71 రకాల వైరస్‌లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. జంతువుల నుంచే కొవిడ్ వైరస్ మనుషులకు సోకిందని అనేక పరిశోధనలు వెల్లడించిన నేపథ్యంలో చైనా లోని జంతుమాంసం మార్కెట్లే లక్షంగా చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా, శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షలు చేశారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1725 వన్యప్రాణులపై ఈ పరీక్షలు జరిపినట్టు వారు వెల్లడించారు. చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన పలు జంతువులపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.

చైనా లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త షూసు మాట్లాడుతూ ఈ పరీక్షల ద్వారా 71 రకాల వైరస్‌లను గుర్తించామని, అందులో 45 వైరస్‌లను కొత్తగా కనుగొన్నామని, వీటిలో 18 రకాలు మనుషులు, జంతువులకు కూడా చాలా ప్రమాదకరమైనవని చెప్పారు. వైరస్‌ల వ్యాప్తిలో వన్యప్రాణులే కీలక పాత్ర పోషిస్తాయనడానికి ఈ వివరాలే ఉదాహరణగా పేర్కొన్నారు. పిల్లుల మాదిరిగా ఉండే సివెట్స్ అనే జంతువుల్లోనే అత్యధికంగా ప్రమాదకరవైరస్‌లను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలాల నుంచి వచ్చే హెచ్‌కేయూ8 రకం వైరస్ ఓ సివెట్‌కు వ్యాపించినట్టు గుర్తించామన్నారు. ఇంకా పలు జంతువుల్లో కూడా ఈ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News