Friday, November 22, 2024

ఆక్సిజన్ కొత్త రూపం 28ని కనుగొన్న జపాన్ శాస్త్రవేత్తలు

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్‌కు చెందిన అణుభౌతిక శాస్త్రవేత్తలు ఆక్సిజన్ లోని కొత్త రూపమైన కొత్త ఐసొటోప్ 28 ని కనుగొనగలిగారు. జపాన్ లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అణుభౌతిక శాస్త్రవేత్త యొసుకె కొండో నేతృత్వం లోని భౌతిక శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు. ఆక్సిజన్ లోని న్యూక్లియస్ ( కేంద్రకం) లో ఇదివరకెన్నడూ చూడని అత్యధిక సంఖ్యలో న్యూట్రాన్లు ఉండడం ఆక్సిజన్ 28 ప్రత్యేకత. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆక్సిజన్ 28, ఆక్సిజన్ తాలూకు భారమైన రూపాంతరంగా చెబుతున్నారు. ఈ ఆక్సిజన్ 28 ని కనుగొనడం అద్భుతమైన ఘట్టంగా పేర్కొన్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే న్యూక్లియర్ ప్రయోగాలకు సైద్ధాంతిక పరిశోధనలకు కీలకం కానున్నదని చెబుతున్నారు. ఇందులో ప్రోటాన్ సంఖ్య జెడ్ 28 వరకు ఉంటుందని, న్యూట్రాన్ల సంఖ్య 20 వరకు ఉంటుందని , ఇవి రెట్టింపు మేజిక్ న్యూక్లియస్‌లుగా అభివర్ణిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News