- Advertisement -
వాషింగ్టన్ : భూమి పుట్టుక, అది జీవానికి అనుకూలంగా మారడానికి ఇక్కడి ఉపరితలంపై ఎలాంటి పరిణామాలు సంభవించాయో, అంగారక గ్రహంపై కూడా అలాంటి చర్యలే జరిగినట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. భూమిపై ఉన్న అగ్నిశిలలను అంగారక గ్రహంపై కూడా గుర్తించారు. మార్స్‌పై అగ్ని పర్వతాలు పేలిపోయి, పెద్దపెద్ద అగ్ని శిలలు ఏర్పడ్డాయని అరిజోనా స్టేట్ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పారు. 16 ఏళ్ల క్రితం నాసా పంపిన స్పిరిట్ రోవర్ తీసిన ఫోటోలను విశ్లేషించారు. ఆ రాళ్లను ఒలివైన్ సమ్మేళనానికి చెందిన ఇగ్నిమ్‌బ్రైట్ అగ్నిశిల గా పేర్కొన్నారు. అగ్నిపర్వత విస్ఫోటం వల్ల ఈ శిలలు ఏర్పడతాయని తెలిపారు. గుసెవ్, జెజెరో క్రేటర్ల (అగ్నిపర్వత ముఖద్వారాలు) దగ్గర రోవర్ ఈ శిలల ఫోటో తీసినట్టు తెలిపారు. ప్రస్తుతం పర్సీవరెన్స్ రోవర్ అక్కడే నమూనాలను సేకరిస్తోంది.
- Advertisement -