Wednesday, January 22, 2025

మొక్కల్లో చందమామ

- Advertisement -
- Advertisement -

Scientists grow plant in lunar soil

ముందుముందు కనువిందు
మనిషి యాత్రకు ఏర్పాట్లు
పంటలు ప్రాణవాయువు ఉత్పత్తి
భువికి వచ్చిన విశ్వాంతర నాట్లు

వాషింగ్టన్ : చంద్రుడిపై కూడా మొక్కలు పెరుగుతాయని నిరూపితం అయింది. చంద్ర మండలపు మట్టిలో తొలిసారిగా పెంచిన మొక్కలను ఇప్పుడు అపోలో మిషన్స్‌కు చెందిన వ్యోమగాములు భూమికి తీసుకువచ్చారు. చంద్రుడు జడపదార్థం కాదని, అక్కడి నేల మొక్కల పెంపకానికి అనువైనదని ఇప్పుడు వెల్లడైంది. చంద్రమండలం ఎంతవరకూ మనిషి మనుగడకు అనువైనది? భూమికి అనుసంధానంగా అక్కడ స్థావరాలు ఏర్పర్చుకోవచ్చా? అనే దిశలో పలు ప్రయోగాలు జరుగుతూ వస్తున్నాయి. తదుపరి అంతరిక్ష యాత్రల దశలలో చంద్రుడిపై ఆహార పంటల పెంపకాలు, అక్కడ దండిగా ఆక్సిజన్ ఉత్పత్తి సంబంధిత ప్రయోగాలకు ఈ మొక్కల పెంపకం ఓ కీలక ఘట్టం అయింది. చంద్రుడి ఉపరితలంలోని నేలపొరలు సాగుకు అనువుగా ఉన్నాయని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా (యుఎఫ్) పరిశోధకులు తేల్చారు. అక్కడ విత్తనాలు చల్లవచ్చు. చెట్లూ చేమలను పెంచవచ్చునని ఇప్పుడు వ్యోమగాములు పై నుంచి తీసుకువచ్చిన ఈ మొక్కల సముదాయంతో స్పష్టం అయింది. విశ్వ మానవాళి భవిష్యత్ అవసరాలకు దోహదం చేసే ఈ అధ్యయనాలు, పరిశోధనల పత్రాన్ని బయాలజీ సంబంధిత జర్నల్‌లో తాజాగా ప్రచురించారు.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మక స్థాయిలో మనుష్యులను చంద్రమండల నివాసానికి తీసుకువెళ్లేందుకు ఓ భారీ స్థాయి అంతరిక్ష యాత్రల సంబంధిత అర్టిమిస్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా చంద్రుడిపై నివాసానికి సిద్ధపడే ఉత్సాహవంతులను అక్కడికి చేరుస్తారు. అయితే మనుష్యులను చంద్రుడిపైకి తీసుకువెళ్లే అత్యంత కీలకమైన వాణిజ్య కార్యక్రమం అంత తేలికకాదని, ముందుగా అక్కడ మొక్కల పెంపకానికి తద్వారా సరైన స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తికి వీలేర్పడుతుందా? అనే విషయాలను ముందుగా నాసా పరిశోధించింది. ఈ క్రమంలో ఇప్పుడు అక్కడ పెంచిన మొక్కలు ఇప్పుడు భూమికి తిరిగొచ్చాయి. భూమిపై ఉండే మట్టికి, చంద్రమండలంపై ఉండే ఉపరితల పొరలకు అసలు పొంతనే లేదని ఇప్పటికే నిర్థారించారు. చంద్రుడిపై మొక్కలు పెంచడం, ఇదే దశలో అక్కడ ఆక్సిజన్, నీరు, బలవర్థకాలు, కాంతిని ఇనుమడింపచేయడం వంటి ప్రక్రియలతో చంద్ర మండలాన్ని సమీపభవిష్యత్తులో మానవ ఉనికికి వీలయిన ప్రాంతంగా చేయాలనే లక్షంతో నాసా సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News