Monday, December 23, 2024

48500 ఏళ్ల పురాతన వైరస్‌ను పునరుద్ధరించిన శాస్త్రజ్ఞులు !?

- Advertisement -
- Advertisement -
సైబీరియా మంచులో పూడుకుపోయిన ‘జాంబీ వైరస్’ పునరుద్ధరణ ?!

సైబీరియా: రష్యాలోని సైబీరియా ప్రాంతంలో మంచులో సమాధి అయిపోయిన ప్రాచీన కాల శాంపిల్స్‌ను యూరొపియన్ పరిశోధకులు పరిశీలించారు. పరిశోధకులు దాదాపు రెండు డజన్ల వైరస్‌లను పునరుద్ధరించారు. వాటిలో ఒకటి 48500 ఏళ్ల పురాతనమైనది. వాతావరణ మార్పుల కారణంగా పురాతన శాశ్వత మంచు కరిగిపోవడం వల్ల మానవులకు కొత్త ముప్పు పొంచి ఉందని వారంటున్నారు. తాము 13 కొత్త పాథొజెన్స్‌ను పునరుద్ధరించామని యూరొపియన్ పరిశోధకులు చెబుతున్నారు.

రష్యాలోని సైబిరియా ప్రాంతంలో తాము పర్మాఫ్రాస్ట్ నుంచి ప్రాచీన శాంపిల్స్ సేకరించామని యూరొపియన్ పరిశోధకులు అంటున్నారు. వాటికి వారు ‘జాంబీ వైరస్‌లు’ అని పేరు పెట్టారు. అనేక సంవత్సరాలు అవి మంచులో గడ్డకట్టుకుపోయినప్పటికీ ఇప్పటికీ సంక్రమణ శక్తిని కలిగి ఉన్నాయని వారంటున్నారు. పరిశోధకుల బృందంలో రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల వారున్నారు.
‘ఈ వైరస్‌లు బయటి వాతావరణంలోకి వస్తే ఎంత మేరకు సంక్రమించవచ్చు, సంక్రమించిన వారిలో ఎంత మంది బతికి బట్టకట్టవచ్చు’ అనేవి తేలాల్సి ఉంది. వారు ప్రీప్రింట్ రిపోజిటరీ ‘bioRxiv’ కి పోస్ట్ చేసిన ఓ ఆర్టికల్‌లో వివరాలు రాశారు. అది ఇంకా సమీక్షించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News