Friday, November 22, 2024

మరింత విస్తరించిన ఓజోన్ కన్నం

- Advertisement -
- Advertisement -
Scientists say the ozone hole is bigger than normal
భూమిపై మరింత సూర్యప్రతాపం

బెర్లిన్ : అంటార్కిటికా ప్రాంతంలో భూ సంరక్షక ఓజోన్ పొరకు పడ్డ కన్నం పరిణామం ఈసారి విస్తరించింది. ఇక్కడి దక్షణ ధృవ ప్రాంతంలో ఈ ఏడాది నెలకొన్న ఈ పరిస్థితి గురించి యూరోపియన్ యూనియన్‌కు చెందిన కొపర్నికస్ వాతావరణ పర్యవేక్షణ సేవల సంస్థ తెలిపింది. ఈ ఓజోన్ పొర రంధ్రం ఇప్పుడు అంటార్కిటికా సైజ్ కన్నా ఎక్కువగా ఉంది. ఈ ధృవ ప్రాంతంలోని ప్రతి వేసవి కాలంలో ఈ ఓజోన్ పొర రంధ్రం కన్పిస్తుంది. అయితే ఈసారి దీనిని గమనించినప్పుడు ముందు కన్పించిన దానితో పోలిస్తే తరువాతి వారాలలో ఎక్కువ అవుతూ వచ్చింది. ఇంతకు ముందటి స్థాయితో పోలిస్తే ఇప్పుడు ఇది అసాధారణ రీతిలో పెద్దగా ఉందని శాటిలైట్ మానిటరింగ్ విభాగం హెడ్ విన్సెంట్ హెన్నీ పియూచ్ తెలిపారు.

ఈసారి ఈ రంధ్రం ఇంతకు ముందు కన్నా పెద్దదిగా ఉండటమే కాకుండా లోతు కూడా పెరిగిందని నిర్థారించారు. సాధారణంగా భూమి వాతావరణానికి రక్షణ కవచంగా ఓజోన్ పొర పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత ధార్మిక కిరణాలను తనలో జీర్ణించుకుంటుంది. ఈ అత్యంత ప్రమాదకరమైన కిరణాలు ఓజోన్ పొరల బలహీనత దశలో నేరుగా భూమికి చేరడం జరిగితే అది ప్రాణికోటికి ముప్పుగా వాటిల్లుతుంది. గత ఏడాది తలెత్తిన ఓజోన్ పొర కన్నం గురించి పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. తరువాతి క్రమంలో ఇది విస్తరించుకుపోవడం కీలక పరిణామం అయింది. 1987లో కుదిరిన మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం హాలోకార్బన్స్ వంటి రసాయనికాలు సోకడంతోనే ఓజోన్ పొర విచ్ఛిన్నం అవుతోందని గుర్తించారు. దీనితో ఈ హాలో కార్బన్స్ వాడకంపై నిషేధం విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News