Thursday, January 23, 2025

మెడ్చెల్ లో సైంటిస్ట్ సీక్రెట్ గ్యాంబ్లింగ్ అడ్డా రట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెడ్చెల్ పోలీసులు, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ కలిసి మెడ్చెల్ జిల్లాలోని కండ్లకోయ గ్రామంలో గుట్టుగా నడుస్తున్న గ్యాంబ్లింగ్ డెన్ ను ఛేదించారు. దాడి చేసి దాదాపు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు సీడ్స్ కంపెనీకి పనిచేస్తున్న విత్తన సైంటిస్ట్ పి.రాజేశ్ ఈ గ్యాంబ్లింగ్ అడ్డాను నడుపుతున్నాడని ఆరోపణ.

అధికారులు రూ. 53510 నగదు, రూ. 61620 విలువ చేసే గ్యాంబ్లింగ్ ప్లాస్టిక్ కాయిన్స్, 13 సెల్ ఫోన్లు, 36 సెట్ల పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు.  అంతా కలిపి రూ. 1.8 లక్షలుంటుంది. నిందితుడు రాజేశ్ గత మూడేళ్లుగా ఈ గ్యాంబ్లింగ్ డెన్ ను నడిపిస్తున్నారని తెలిసింది. గ్యాంబ్లింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తి నుంచి అడ్వాన్స్ గా రూ. 20000 తీసుకుని దానికి బదులుగా గ్యాంబ్లింగ్ ప్లాస్టిక్ కాయిన్స్ ఇస్తారు. రోజుకు 50 గేములను నడిపిస్తుంటారని, గేమ్ కు రూ. 1000 రాజేశ్ తీసుకుంటుంటాడని పోలీసులు తెలిపారు.

గ్యాంబ్లింగ్ అడ్డాలో పట్టుకున్న వారిలో వేర్వేరు వృత్తుల వారు ఉన్నారు. ముఖ్యంగా మేస్త్రీ, మెడికల్ స్టోర్ ఓనరు, రైతు, సూపర్వయిజర్, హెల్పర్, వ్యాపారస్తుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి వంటి వారు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News