- Advertisement -
అమరావతి: ఎస్ఎస్ఎల్ వి-డి1 రాకెట్ ప్రయోగంలో సందిగ్ధత నెలకొంది. నెల్లూరులోని శ్రీహరికోట నుంచి ఆదివారం ఉదయం చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్ వి-డి1 రాకెట్ ను ఇస్రో ప్రయోగించింది. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ మూడో దశ తర్వాత ఈఓఎస్-02, ఆజాదీశాట్ ఉప గ్రహాలను వదిలింది. అయితే, సాంకేతిక లోపంతో ఉపగ్రహాల నుంచి కంట్రోల్ సెంటర్ కు సిగ్నల్స్ అందడం ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఇస్రో ఛైర్మన్.. ”రాకెట్ గమనాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆజాదీ శాట్ ఉపగ్రహాన్ని 750 మంది విద్యార్థులు రూపొందించారని, తుదిదశ సమాచర సేకరణలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ప్రయోగంపై త్వరలోనే సమాచారం ఇస్తాం. కక్షలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయా?, లేదా? అని విష్లేషిస్తున్నాం” అని పేర్కొన్నారు.
Scientists try to signal of SSLV-D1 Rocket
- Advertisement -