Friday, November 15, 2024

సౌర తుపానుపై శాస్త్రవేత్తల హెచ్చరిక (వీడియో)

- Advertisement -
- Advertisement -

Scientists warn of solar storm

న్యూయార్క్ : సౌరతుపాను మంగళవారం భూమిని తాకనున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే జిపిఎస్, రేడియో సిగ్నళ్ల ప్రసారంలో అంతరాయం తప్పదు. ఈ నెల 19న సూర్యగోళం నుంచి విడుదలయ్యే పాము ఆకారంలోని ఫిలమెంట్ (సౌర తుపాను) ప్రభావం నేరుగా భూమికి ఢీకొట్టే ఆస్కారముందని డాక్టర్ తమిథా స్కోవ్ చెప్పారు. దీనివల్ల భూమిపై పలు ప్రాంతాల నుంనచి ఆకాశంలో ధ్రువ కాంతి (అరోరా) వీక్షించవచ్చని తెలిపారు. అలాగే మరికొన్ని చిన్నపాటి సౌర తుపాన్లు విరుచుకుపడే ప్రమాదం ఉందన్నారు. ఈనెల 20,21న జి1 క్లాస్ తుపాను రావచ్చని స్పేస్‌వెదర్ సంస్థ ప్రకటించింది. సౌర తుపాను సమయంలో సూర్యుడి నుంచి వెలువడే శక్తి భూమిపై అన్ని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏడాదిపాటు ఉత్పత్తి చేసే కరెంటు కంటే లక్ష రెట్లు అధికం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News