Tuesday, September 17, 2024

స్పెషాలిటీ కెమికల్స్ పరిశోధన, తయారీని విప్లవాత్మీకరిస్తున్న స్కింప్లిఫై

- Advertisement -
- Advertisement -

స్పెషాలిటీ కెమికల్ మాన్యుఫ్యాక్చరింగ్ స్టార్టప్ స్కింప్లిఫై ఈరోజు సిరీస్ ఏ ఫండింగ్‌లో 9.5 మిలియన్ యుఎస్ డాలర్లను సమీకరించినట్లు వెల్లడించింది. ఈ రౌండ్‌కు ఓమ్నివోర్ తో పాటుగా బెర్టెల్స్‌మన్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ నాయకత్వం వహించగా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు 3ఒన్4 క్యాపిటల్, బీనెక్స్ట్‌ కీలక భూమిక పోషించాయి. అగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్, ఫ్లేవర్స్ & ఫ్రాగ్రాన్సెస్ రంగాల కోసం సైన్స్-ఫస్ట్, సమగ్రమైన కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తున్న భారతదేశంలోని ప్రముఖ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ, స్కింప్లిఫై. ఈ కొత్త రౌండ్‌తో, కంపెనీ తమ ఆర్& డి సామర్థ్యాలను రెట్టింపు చేయాలని, కీలకమైన కస్టమర్ విభాగాలు ఉన్న మరిన్ని ప్రాంతాలను జోడించాలని యోచిస్తోంది.

స్కింప్లిఫై సహ-వ్యవస్థాపకుడు సలీల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ” దశాబ్దాలుగా రసాయన శాస్త్ర ప్రత్యేక నైపుణ్యాన్ని రూపొందించిన మధ్య-పరిమాణ కర్మాగారాలు, భారతీయ ప్రత్యేక రసాయనాల తయారీకి వెన్నెముకగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ, అందుబాటులో వున్న మౌలిక సదుపాయాలతో వచ్చే 5 సంవత్సరాలలో,జాతీయ ఉత్పత్తిని రెట్టింపు చేసే సామర్థ్యం గణనీయంగా అందుబాటులో ఉంది. స్కింప్లిఫై ఈ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి అత్యాధునిక ఆర్& డి ని ఉపయోగించి ఈ ఫ్యాక్టరీలకు ప్రత్యేకమైన ఉత్పత్తులను అందించనుంది” అని అన్నారు .

ఓమ్నివొర్ యొక్క మేనేజింగ్ పార్టనర్ మార్క్ కాన్ మాట్లాడుతూ..“ఆర్ & డిని క్రమబద్ధీకరించడం, పర్యావరణ అనుకూల సూత్రీకరణల తయారీ ద్వారా, స్కింప్లిఫై ప్రపంచ డిమాండ్‌లను తీరుస్తోంది. వారి విధానం నియంత్రణ అవసరాలు, వినియోగదారుల అవసరాలు, పర్యావరణ ఆందోళనలను సంతృప్తిపరుస్తుంది, పరిశ్రమ ప్రమాణాలను పెంచుతుంది” అని అన్నారు.

బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, దుబాయ్‌లలో తమ కార్యాలయాలు, జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్ లోని పరిశోధనా ల్యాబ్‌లతో, స్కింప్లిఫై తమ కార్యకలాపాలను నిరంతరం విస్తరిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News